నేటిసాక్షి, మిర్యాలగూడ : గత 50 సంవత్సరాలుగా ఎస్టీ జాబితాలో ఉన్న లంబాడి గిరిజనులను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు లు డిమాండ్ చేయడం రాజ్యాంగ వ్యతిరేఖమని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్రనాయక్, రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండల కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం మండల మహాసభను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రా నాయక్, రవినాయక్ మాట్లాడుతూ, లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని సుప్రీం కోర్టులో కేసు వేశామనే పేరుతో సోషల్ మీడియాలో అవాస్తవాలు మాట్లాడుతూ, విద్వేషాలను రెచ్చగొడుతూ, ఘర్షణ సృష్టించే వారిపట్ల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కొరకు బిజెపి, కాంగ్రెస్ పార్టీల మాయలో గిరిజనులు పడోద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ గిరిజన సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులుగా సపావత్ పాపా నాయక్ ఆంగోత్ కాంతారావు గారితో పాటు 18 మందితో నూతన కమిటీ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు వినోద్ నాయక్, శ్రీహరి చంద్రకళ దయానంద్, శ్రీహరి, చంద్రకళ, దయానంద్, బాలు, విజయ్, తదితరులు పాల్గొన్నారు.





