నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 10, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని సూర్యచంద్ర ఫంక్షన్ హాల్ లో వివిధ గ్రామాలకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంగళవారం నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి ఆధ్వర్యంలో మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా మరికల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నారాయణపేట నియోజకవర్గం ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన ప్రతి లబ్ధిదారుడు ఇండ్లను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదన్నారు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినందుకుగాను కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డికి రుణపడి ఉంటామని లబ్ధిదారులు సభాముఖంగా వివరించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్య మోహన్ రెడ్డి, గొల్ల కృష్ణయ్య ధన్వాడ సింగల్ విండో చైర్మన్ వై వెంకట్రామారెడ్డి,మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బెల్లగుంది వీరన్న, మరికల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరీష్ కుమార్,రామన్ గౌడు, మాజీ ఎంపీటీసీ సీమ గోపాల్, నాగరాజు, ఎల్ రాములు, చెన్నయ్య, టైసన్ రాఘవేంద్ర, పెంట మీద రాఘవేంద్ర, ఏ ఆంజనేయులు, రామకృష్ణారెడ్డి, రామకృష్ణ, జంగిడి రఘు, జంగిడి ఆంజనేయులు నారాయణ జనార్దన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

