నేటిసాక్షి, గన్నేరువరం,(బుర్ర అంజయ్య గౌడ్): గన్నేరువరం మండల కేంద్రంలోని ఆయుర్వేద వైద్యశాల ముందు మంగళవారం రేకుర్తి కంటి ఆస్పత్రి వైస్ చైర్మన్ లయన్ చిదుర సురేష్ సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ గన్నేరువరం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ అవసరం ఉన్నవారికి రేకుర్తిలోని కంటి ఆసుపత్రికి ఉచిత బస్సులో తీసుకువెళ్లారు. వారికి కంటి ఆపరేషన్ చేసిన తర్వాత మళ్లీ గురువారం రోజున గన్నేరువరానికి ఉచిత బస్సులోనే ఇంటికి పంపిస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకట్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొలుపుల మోహన్, బొడ్డు సునీల్, గంప వెంకన్న, మాధవరావు, బూర శ్రీనివాస్, తేళ్ల భాస్కర్, జీల ఎల్లయ్య, ఆర్.ఎం.పి డాక్టర్ శ్రీనివాస్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





