Tuesday, March 10, 2026

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నోట్స్ పెన్నులు పంపిణీ…

నేటి సాక్షి, బెజ్జంకి:

మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని చీలాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ సభ్యుడు, డిస్ట్రిక్ట్ కమిటీ చైర్ పర్సన్ చీపురిచెట్టి మోహన్ రెడ్డి జన్మ దినాన్ని పురస్కరించుకుని ఆయన సౌజన్యంతో పాఠశాలలోని 70 మంది విద్యార్థులకు నోట్స్ బుక్కులు, పెన్నులు పంపిణీ భేయడం జరిగింది. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటడం జరిగింది.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అందించే సేవల గురించి, విద్యార్థుల ఉన్నతి గురించి పలువురు వక్తలు మాట్లాడారు.ఈ కార్యక్రమములో పాఠశాల ప్రదానోపాద్యాయులు మెట్ల తిరుమలేష్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, సెక్రటరీ బాబాయి మాత, వెగ్గలం జానకి రాములు, సుదర్శన్ రెడ్డి, జడ్సీ రవీంద్ర ప్రసాద్ ఉపాధ్యాయులు రామంచ రవీందర్, వీర బత్తిని కవిత ,వడ్డేపల్లి చంద్రమౌళి, పైడి కవిత అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News