Wednesday, March 18, 2026

*లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ పరీక్షలు*

*నేటి సాక్షి, ధర్మారం (నవంబర్ 14)*: వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం సుమారు 50 మంది వాకర్స్‌కి ఉచిత డయాబెటిక్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలలో 8 మందికి షుగర్ ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం వారికి జీవనశైలి మార్పులు, ఆహార నియమాలు వంటి అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇప్ప మల్లేష్, సెక్రటరీ భూత గడ్డ రవి, సభ్యులు లయన్ కడారి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News