గుంటూరులో డాన్స్ మాస్టర్స్ అండ్ డ్యాన్సర్స్ భారీ ర్యాలీ నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) తిరుపతి గుంటూరుకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ కుమార్తె లాస్య అనుమానాస్పద మృతికి కారణమైన లలిత హాస్పిటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అండ్ టీవీ డాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ మేరకు యూనియన్ అధ్యక్షుడు సూర్య వేణు తిరుపతిలో ఓ ప్రకటన విడుదల చేశారు. జూన్ 16 సోమవారం ఉదయం 9 గంటలకు గుంటూరు కలెక్టరేట్ వద్ద డాన్స్ మాస్టర్స్ మరియు డాన్సర్లు భారీగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ లక్ష్మీకాంత్, సెక్రటరీ అరుణ్ కుమార్, ట్రెజరర్ మున్నా, వైస్ ప్రెసిడెంట్లు భాస్కర్, నాని, రామకృష్ణ, సభ్యులు రాము, సతీష్, బాబు, గౌతం, నాగార్జున, గంగాధర్, కోటి తదితరులు పాల్గొననున్నారు.వైద్య సేవలు అందించే ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే లాస్య ప్రాణాలు కోల్పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి తరువాత కనిపించే దేవుడిగా భావించే డాక్టర్లు బాధితుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. లాస్య మరణంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని వారు ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకొని న్యాయం చేస్తుందని నమ్మకముందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత స్పందించాలని యూనియన్ విజ్ఞప్తి చేసింది.