Tuesday, March 10, 2026

లింగంపల్లి గ్రామంలో కల్లు దుకాణంలో సీసలు తీస్తున్నా బాల కార్మికులు….. లింగంపల్లి జాతరలో కల్లు ధర రూ,30 రూపాయలు… లింగంపల్లి బెల్ట్ షాప్ లలో అధిక రేట్లు….

నేటి సాక్షి నారాయణపేట జనవరి 27 (రిపోర్టర్ ఇమాంసాబ్), నారాయణపేట జిల్లాలోని లింగంపల్లి గ్రామంలో ఎల్లమ్మ జాతర మహోత్సలలో సందర్భంగా గ్రామంలోని కల్లు దుకాణంలో చిన్నపిల్లలతో కల్లు తాగి పడేసిన కల్లు సీసాలు తీస్తున్నారు. అదేవిధంగా జాతర సందర్భంగా గ్రామంలో ఒక్క కళ్ళు సీసా 30 రూపాయలు ధర పెంచడంతో జాతరకొచ్చే కల్లు ప్రియులు రూ,30 రూపాయలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతరలో కలు సీసా ధర ఇంత పెంచడంపై మహిళలు ఇదెక్కడ రేటు ఎంత పెంచారంటూ జాతరకు వచ్చే జనాలు చర్చించుకుంటున్నారు. లింగంపల్లి గ్రామంలో మద్యం బెల్టు దుకాణాలు జోరుగా వెలిశాయి. ఒక్క మద్యం సీసా వెంబడి 40 రూపాయల నుండి 50 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని మద్యం ప్రియులు ఒకరికొకరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతరలో ఇంత జరుగుతున్న పట్టించుకోవడంలేదంటూ మద్యం ప్రియులు గ్రామస్తులు లింగంపల్లి గ్రామంలో చర్చించుకుంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News