నేటి సాక్షి 21 పాములపాడు:- పాములపాడు మండలంలోని, లింగాల గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం-2 కి సమాజ సేవకుడు నవీన్ కుమార్ గౌడ్ కంప్యూటర్, వెయిట్ మెషిన్ ను డొనేట్ చేయడం జరిగింది. ప్రతి రోజూ పిల్లలకు వెయిట్ చూడడానికి మరియు వారికి వెయిట్ చూసిన వెంటనే బరువులో తేడా వస్తే మంచి పౌష్టికాహారం అందించడానికి మాకు తెలుస్తుందని అంగన్వాడీ కేంద్రం వర్కర్స్ స్ బి.రమాదేవి మరియు ఆయా వెంకటేశ్వరమ్మ, గ్రామ పెద్దలు సమాజ సేవకుడు నవీన్ కుమార్ గౌడ్ ను అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు కూడా కొనసాగుతాయని సమాజ సేవకుడు నవీన్ కుమార్ గౌడ్ తెలిపారు.

