Sunday, March 15, 2026

లింగాల లో అంగన్ వాడి కేంద్రం చుట్టూ వర్షపు నీరు వర్షం నీటిలో ఇబ్బంది పడుతున్న చిన్నారులు పాములపాడు అక్టోబర్ 31..

నేటి సాక్షి:నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలూకా పాములపాడు మండలం పాములపాడు మండలం లోని లింగాల గ్రామంలో బీసీ కాలనీలో ఉన్న అంగన్వాడీ సెంటర్ 2 చుట్టూ.. ఈరెండు రోజుల వర్షానికి ముంత తుఫాన్ కారణంగా వర్షపు నీరు అంగన్వాడీ కేంద్రంలోకి నీరు చేరింది. దీనితో చిన్నారులు సెంటర్లోనికి వెళ్లడానికి మరియు ఆడుకోవడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. మరియు తల్లీ తండ్రులు చిన్నారులను వదిలి వెళ్ళటానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమస్య గురించి,సిపిఎం మండల నాయకులు టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వర్షం నీరు అంగన్వాడి కేంద్రం చుట్టూ చేరడంతో ఆకులు కుళ్ళి వాసనతో దుర్గంధం వస్తుందని అలాగే విషపురుగులు సంచరిస్తున్నాయన్నారు. మరియు విష పాములు వస్తుంటాయి.దీంతో చిన్నారుల తల్లిదండ్రులు అంగన్వాడి సెంటర్ కు పిల్లలను పంపడానికి నిరాకరిస్తున్నారు. ఇదే విషయంపై పలుమార్లు అధికారులకు నీరు చేరిన సమస్యను విన్నపించడం జరిగిందని. కానీ ఇప్పటివరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇలాగే ఉంటే పిల్లలకు ఏ హాని అయినా జరగవచ్చు.కాబట్టి ఇక్కడ సమస్య ఇప్పటికైనా అధికారులు స్పందించి చిన్నపిల్లలకు ఏ హాని జరగకూడదు.అని నా అభిప్రాయం అని వెంకటేశ్వర రావు తెలియపరిచారు.అంతేకాకుండా ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని భవిష్యత్తులో అంగన్వాడి కేంద్రం చుట్టూ నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఇలాగే ఉంటే లింగాల గ్రామ ప్రజలు మరియు అంగన్వాడీ సెంటర్ కు సంబంధించి న చిన్నారుల తల్లీ తండ్రుల అందరూ కలిసి నందికొట్కూరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నను. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ సమస్య వెంటనే తిరుస్తారని కోరుకుంటున్నాను..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News