నేటి సాక్షి 04 పాములపాడు:-పాములపాడులో మండలంలోని లింగాల గ్రామంలో ఎం పీ.బైరెడ్డి . శబరి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు లింగాల గ్రామంలో నవీన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు.ఈ కార్యక్రమం కి ముఖ్య అతిథిగా ప్రభుత్వ టెలికాం అడ్వైజర్ కమిటీ మెంబర్ & నందికొట్కూరు నియోజవర్గ యువ నాయకుడు కురువ.రమేష్ ఆధ్వర్యంలో డైనమిక్ లీడర్ & నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పుట్టినరోజు వేడుకలను నాయకులు, కార్యకర్తల మధ్యన ఘనంగా నిర్వహించడం జరిగింది. బైరెడ్డి అభిమానులు, కూటమి నాయకుల, కార్యకర్తల సమక్షంలో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి పుట్టినరోజు సందర్భంగా టిడిపి యువ నాయకుడు కురువ.రమేష్ ఆధ్వర్యంలో భారీ కేక్ ను కటింగ్ చేసి ఒకరికి, ఒకరు తినిపించుకొని సంతోషంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. డాక్టర్ బైరెడ్డి శబరి జన్మదిన వేడుకలలో చిన్నారులు కూడా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. అనంతరం ప్రభుత్వ టెలికాం అడ్వైజరి కమిటీ మెంబర్ కురువ. రమేష్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈ సందర్భంగా టిడిపి యువ నాయకుడు కే.రమేష్ మాట్లాడుతూ మన రాయలసీమ పులి & నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వారసురాలు, తండ్రిలోని మంచితనాన్ని పునికిపుచ్చుకొని కష్టాల్లో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు నేనున్నానని భరోసా కల్పిస్తూ అన్ని రకాలుగా సహాయం అందిస్తున్న నంద్యాల ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటూ, గొప్ప గొప్ప పదవులు చేపట్టి, ప్రజలకు మంచి సేవ చేయాలని ఆ దేవున్ని ప్రార్థిస్తూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో లింగాల నవీనకుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రజా సేవ ధ్యేయంగా, వికాసమే లక్ష్యంగా నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం అబివృద్ధి కి నిరంతరం కృషి చేస్తున్న నంద్యాల ఎంపీ. బైరెడ్డి శబరి ఇలాగే ప్రజల ఆశీసులు లతో మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరోగ్యం ఐశ్వర్యం, ప్రజల ప్రేమ ఎల్లప్పుడూ మీ వెంట ఉండాలని మీ నాయకత్వం లో నంద్యాల మరింత వెలుగు పొందాలని అని కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం లో మాజీ జెడ్పీటీసీ నాగేశ్వరరావు, టెలికాం సలహా కమిటీ సభ్యులు కురువ రమేష్ మరియు డేగల. లోకేష్, రామ్మూర్తి యాదవ్, చిన్న అంబయ్య, అమృత శివ భాస్కర్ గంట వెంకటేశ్, విశ్వేశ్వర బాబు, మళ్ళీ పాల్గొన్నారు.

