నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం లిల్లీపూర్ గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా డా.వైఎస్సార్ కి దుబ్బచెర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అల్లం బాల్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యాదయ్య,విజయ్ రెడ్డి, సంజీవరెడ్డి,సుధాకర్,రాజు,మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గొల్లూరి రాజు,బొల్లు కుమార్ యాదవ్,పాపయ్య మరియు అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.