శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ యూనివర్సిటీలో కరపత్రాల ఆవిష్కరణ…
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
మనదేశంలోని పెట్టుబడిదారు ప్రయోజనాల కోసం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది వీటిని రద్దు చేయాలని కోరుతూ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ, ఆప్కాస్ సంస్థల ఆధ్వర్యంలో ఎస్వీ యూనివర్సిటీ లో కరపత్రం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన 22 సమ్మెలో ఈ సమ్మె వ్యత్యాసం ఉంది 16 డిమాండ్లు ఉన్న అన్నిట్లోనూ లేబర్ కోడ్స్ అడ్డుకోవడమే ప్రధానమైన అంశం లేబర్ కోడ్స్ అమలులోకి వస్తే చట్టాలు వర్తించే కార్మికులు, చట్టాలు వర్తించని కార్మికులు అందరూ కూడా బానిసత్వంలోకి నెట్టబడతారు. పని ప్రదేశంలో కార్మికులకు రక్షణ ఆరోగ్య భద్రత పనిగంటలు వారాంతపు సెలవులు లీవులు తదితర హక్కులను కోల్పోతారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వేచ్ఛనిచ్చే లేబర్ కోర్టులో రద్దు కావాలి కొత్తగా ఫ్యాక్టరీల్లో తామనుకున్నంత కాలం కార్మిక చట్టాల అమలుకాకుండా నిర్దేశించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది కార్మిక హక్కులపై దాడి ఇది గొడ్డలి పెట్టు లాంటిది. కాబట్టి కార్మిక సమస్యలను పరిష్కారం దిశగా ప్రభుత్వాలు పూనుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
రాష్ట్రంలో దేశంలో కాంటాక్ట్ కార్మికుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి చట్ట ప్రకారం పర్మినెంట్ కార్మికులు చేసే పనిని కాంటాక్ట్ కార్మికులు చేస్తే వారికి పర్మినెంట్ కార్మికుల వేతనాలు అలవెన్సులు బెనిఫిట్ లు ఇవ్వాలి. సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పునిచ్చింది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరపడం లేదు కాబట్టి కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి పెర్మనెంట్ చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది.
ఈ కరపత్రం ఆవిష్కరణలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్. జయచంద్ర, అప్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి. చిన్నబాబు, ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంటాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గండికోట నాగవెంకటేష్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వర్క్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రాజేంద్ర, కార్యదర్శి మురగయ్య, కోశాధికారి గణేష్, కమిటీ సభ్యులు రవి తదితరులు పాల్గొన్నారు..