Wednesday, March 11, 2026

లైసెన్స్డ్ సర్వేయర్లకు ఇచ్చిన హామీ ప్రకారం బాధ్యతలు అప్పగించి, వేతనాలు చెల్లించాలి: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

.నేటి సాక్షి వికారాబాద్ :వికారాబాద్ జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ని వారి నివాసంలో కలిసి, వినతిపత్రం సమర్పించిన వికారాబాద్ జిల్లాకు చెందిన లైసెన్స్డ్ సెర్వేయర్లు. ఈ సందర్బంగా డాక్టర్ మెతుకు ఆనంద్ స్పందిస్తూ… లైసెన్స్డ్ సర్వేయర్లకు హామీ ఇచ్చి 8నెలలు గడిచిన బాధ్యతలు అప్పగించకుండా, వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.గతంలో ఇచ్చిన హామీలు పేపర్ మీద తప్ప అమలులో పూర్తిగా విఫలం.దాదాపు పదివేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను అయోమయంలో పెట్టి రోడ్డున నిలబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.దీంతో మరోసారి బయటపడిన కాంగ్రెస్ ప్రభుత్వ మోస బుద్ది.వికారాబాద్ నియోజకవర్గం నుండి 97 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు ఉన్నారు. గౌరవ స్పీకర్ దీనిమీద స్పందించండి, లైసెన్స్డ్ సెర్వేయర్లకు తగిన న్యాయం జరిగేలా చూడండి.రాహుల్ గాంధీ గారికి…. అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చుని నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు గుర్తురావడం లేదా?రేవంత్ రెడ్డి కి ఆయన కుర్చీ కాపాడుకోవడానికి మాత్రమే సమయం సరిపోతుంది తప్పా ప్రజా సంక్షేమం మీద ధ్యాస లేదు.ఇచ్చిన హామీ ప్రకారం లైసెన్స్డ్ సర్వయర్లకు బాధ్యతలు అప్పగించి, వేతనాలు చెల్లించాలని రేవంత్ రెడ్డి ని బీ ఆర్ ఎస్ పార్టీ తరుపున ప్రధాన ప్రతిపక్షంగా, వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా కోరుతున్నాను.ఈ కార్యక్రమంలో పట్టణ బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్ సీనియర్ నాయకులు మేక చంద్రశేఖర్ రెడ్డి పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, పట్టణ జనరల్ సెక్రటరీ గాండ్ల మల్లికార్జున్ లైసెన్స్డ్ సెర్వేయర్ల మండల అధ్యక్షులు శ్యామ్ లైసెన్స్డ్ సెర్వేయర్లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News