నేటిసాక్షి, రాయికల్ : పాడి పంటలు, పిల్లా పాపలు, పశు సంపద చల్లంగా ఉండాలని ఆ జగదంబాను కొలిచే గిరిజనుల తొలి పండుగ పస్కాను మంగళవారం రాయికల్ మండలం లోక్యానాయక్ తండాలో గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు. గిరిజనుల సాంప్రదాయ ప్రకారం వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని తండా పెద్దలంతా జగదంబ మాత సేవలాల్ మహారాజ్ ఆలయ ప్రాంగణంలో ప్రజలు ఆలయాలకు చేరుకొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తండాకు చెందిన ప్రజా గాయకులు గంగాధర్ నాయక్, గిరిజన శక్తి జిల్లా అధ్యక్షులు సంతోష్ నాయక్, రత్తిలాల్ నాయక్, మోతిలాల్ నాయక్, రాజు నాయక్ ,తిరుపతి నాయక్, బలరాం నాయక్ ,దేవుల నాయక్, మంగ్యా నాయక్, భూమ నాయక్, తిరుపతి నాయక్, బాపురావు నాయక్, రవి నాయక్, రవి నాయక్, మంగీలాల్ నాయక్, రమేష్ నాయక్, మురళి నాయక్, సామ్యా నాయక్ , ధర్మీబాయి, జూలీ భాయ్, లక్ష్మీబాయి, సరియా నాయక్ తదితరులు పాల్గొన్నారుఫోటో రైటప్: 24RKL04: పూజలు నిర్వహిస్తున్న దృశ్యం





