Tuesday, April 7, 2026

లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)

ఈనెల 9 నుంచి 14 వరకు హన్మకొండ సెకండ్ క్లాస్ కోర్టులో నిర్వహించే లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి. వెంకన్న సూచించారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ వెంకన్న మాట్లాడుతూ కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెలిసినవారు డ్రంకెన్ డ్రైవ్ లో గాని డ్రైవింగ్ లైసెన్స్ కేసు గాని మైనర్ డ్రైవింగ్ కేసులలో మీ వాహనం సీజ్ చేయబడితే ఈ నెల 9 సోమవారం నుంచి 14 శనివారం వరకు హనుమకొండ సెకండ్ క్లాస్ కోర్టులో లోక్ అదాలత్ ఉందని మీపై గాని మీకు తెలిసిన వాళ్లపై కానీ ఏమైనా కేసులు ఉంటే మీరు కోర్టుకు హాజరైనట్లయితే ఆ కేసును పూర్తిగా క్లోజ్ చేయబడునని తెలిపారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉన్నవారు వారి ఆధార్ కార్డ్స్ జిరాక్స్ వెహికల్ డాక్యుమెంట్స్ తీసుకొని రావాలన్నారు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కేసులో ఉన్నవారు ఆధార్ కార్డు మీ సేవలో లైసెన్స్ కొరకు దరఖాస్తు చేసుకున్న రసీదు తీసుకొని రావాలన్నారు మైనర్ డ్రైవింగ్ కేసులకు సంబంధించిన కేసులో ఉన్నవారు బర్త్ సర్టిఫికెట్ లేక టెన్త్ మేమో మొదలైనవి తీసుకొని రావాలని సూచించారు ఈ లోక్ అదాలత్ లో త్వరిత గతిన కేసును క్లోజ్ చేసుకోవచ్చని ఈ అవకాశాన్ని కేసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News