నేటిసాక్షి, మిర్యాలగూడ : పట్టణంలోని సంతోష్ నగర్ లోనూతనంగా ఏర్పాటు చేసిన “లోటస్ ఆసుపత్రి”ని శుక్రవారం మాజీ సిఎల్పీ నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పట్టణంలో అత్యాధునిక పరికరాలతో, ప్రముఖ డాక్టర్లచే స్థాపించబడిన లోటస్ హాస్పిటల్, పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్కైలాబ్ నాయక్, లోటస్ హాస్పిటల్ యాజమాన్యం రాంబాబు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.

