*నేటి సాక్షి – జగిత్యాల*( రాధారపు నర్సయ్య )అఖండ భారతావనికి స్వాతంత్ర్య స్పూర్తిని నింపిన వందేమాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం సామూహిక గీతాలాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.*ఎస్పీతో కలిసి వందేమాతరం ఆలాపన*జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది దేశభక్తి ఉత్సాహంతో వందేమాతరం గేయాన్ని ఆలపించారు. కార్యాలయం ఆవరణ దేశభక్తి నినాదాలతో మార్మోగింది.*జాతీయ స్పూర్తికి ప్రేరణ: ఎస్పీ అశోక్ కుమార్*ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ..’వందేమాతరం’ మన స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన శక్తివంతమైన గేయం. ఈ గీతం ద్వారా స్వాతంత్ర్య సమరయోధులు ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించారు. ప్రతి భారతీయుడు ఈ గేయం యొక్క చరిత్రను తెలుసుకుని గౌరవంతో గానం చేయాల’ని అన్నారు.దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు సైదులు, వేణు, తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు._________





