Saturday, March 21, 2026

వందేళ్లు అయిన.అభివృద్ధి నోచుకోని గిరి పుత్రుల గ్రామంగత పాలకులు.పనులు చేయకుండానే నిధులు లూటీ చేశారుచదువుకున్న యువకున్ని గెలిపించి గ్రామాన్ని కాపాడుకుందాండా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి డిసెంబర్ 02కొమురం భీం జిల్లా కాగజ్నగర్ మండలంలో కూత దూరంలోదరిగాం గ్రామాన్ని గత పాలకులు దారుణంగా దోచుకున్నారని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్మి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ గ్రామం వందేళ్ల నుండి ఉన్నా,ఇప్పటివరకు రోడ్డు లేదని మౌళిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. సర్పంచ్ గా గెలిచినా ఆదివాసులను మోసం చేసి వారి సంతకాలు పట్టించుకోని నిధుల్ని లూటీ చేశారని మండిపడ్డారు. ఈ రోజు దరిగాం గ్రామంలో బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సర్పంచ్ అభ్యర్థిని ఖరారు చేశారు.అందరూ చదువుకున్న అభ్యర్థిని గెలిపించి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో కేసిఆర్ పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేసి గ్రామాన్ని పచ్చదనం చేయాలని ఆలోచన చేస్తే,ఇక్కడ మాత్రం దట్టమైన అడవిలో కేవలం బోర్డు పెట్టి,ఒక్క మొక్క కూడా నాటకుండా బిల్లులు లూటీ చేశారన్నారు. అంగన్ వాడీ కేంద్రం ఉన్నా టీచర్ రావడం లేదని,పిల్లలకు చదువు చెప్పే నాథుడే లేడని ఆరోపించారు. సర్పంచ్ గా గెలిచిన ఆదివాసులను నామమాత్రులను చేసి,వారి పేరిట వచ్చే అన్ని పనులను వారికే తెలియకుండానే మోసం చేశారన్నారు. ఈ గ్రామం నిధులతో బయటి వ్యక్తులు బాగుపడ్డారని కనీసం లక్ష రూపాయల పని కూడా అక్కడ పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.పాము కరిచినా,గర్భిణీ స్త్రీలు పురిటి నొప్పులతో బాధపడినా,ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ప్రాణాన్ని కాపాడుకోవడానికి కాగజ్ నగర్ చేరే లోపు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.45 ఏళ్లుగా పాలించిన పాలకులకు కనీసం ఈ గ్రామానికి వెళ్లడానికి బ్రిడ్జి నిర్మించేందుకు కూడా మనస్సు రాలేదని,ఇలాంటి దుర్మార్గులను మరోసారి గెలిపించుకుంటే ఊరినే అమ్మెస్తారంటూ మండిపడ్డారు.గ్రామానికి వెళ్లడానికి నిర్మించిన బ్రిడ్జి అవినీతి అక్రమాల వల్ల కనీసం రెండేళ్లు కూడా నిలువకుండానే కుంగిపోయిందన్నారు. ఐటిడిఎ అధికారులు జిల్లా అధికారులు ఒక్కరు కూడా ఆ గ్రామానికి వచ్చి వారి పరిస్థితిని చూడడం లేదని వాపోయారు. వచ్చే ఎన్నికల్లో తాము బలపరిచిన అభ్యర్థిని నిలబెడితే దరిగాం గ్రామానికి రోడ్డు సౌకర్యం,సెల్ ఫోన్ నెట్ వర్క్ సౌకర్యం ,పిల్లలు చదువుకునేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మాటిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఇతర పార్టీల నాయకులు వచ్చి డబ్బు పంచినా,మద్యం పంపిణీ చేసినా,దేవుళ్ల మీద ఒట్లు వేసి ప్రమాణం చేసినా నమ్మొద్దన్నారు. తమ అభ్యర్థి కన్నయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ,కాగజ్ నగర్ మండల నాయకులు మిన్హాజ్,తన్నీరు పోచం,మహమూద్,వాసు,బాబర్,సలీం,హనుమంతు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News