నేటి సాక్షి మహబూబాబా ద్ నరసింహుల పేట( భూక్యా రవి నాయక్) నవంబర్ 7 మహబూబాబాద్:మహాకవి శ్రీ బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించిన జాతీయ గీతం “వందే మాతరం” 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సామూహిక గీతాలాపన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ ఆధ్వర్యంలో గీతాలాపన నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, (రెవెన్యూ) కె. అనిల్ కుమార్, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి, హార్టికల్చర్ అధికారి మరియన్నా, బీసీ, ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు శ్రీనివాసరావు, శ్రీనివాస్, డీఎం సివిల్ సప్లై కృష్ణవేణి, మైన్స్ ఏడి వెంకటరమణ, టీఎన్జీవోస్ జేఏసీ చైర్మన్ వడ్డబోయిన శ్రీనివాస్, డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, మెప్మా విజయ, విజయ కుమారి, మురళి, ఆర్.శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, కొప్పు ప్రసాద్, సక్కుబాయి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం ముగిసిన అనంతరం అధికారులు “వందే మాతరం” గీతం ప్రాముఖ్యతను వివరించి, దేశభక్తి భావాన్ని ప్రతి ఒక్కరులో మేల్కొలిపేలా ఉండాలని సూచించారు.





