బీసీలకు 42శాతం, ఎస్సీ ఉపకులాలకు న్యాయం చేస్తాం: కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి*—– *మహేశ్వరం నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ – 2 సమావేశం*. *నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)*పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు, వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం పాటించేందుకు కసరత్తు చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.ఇవాళ సాయంత్రం బ్లాక్ కాంగ్రెస్ – 2 (ఆర్కేపురం, సరూర్నగర్ డివిజన్లు – బడంగ్ పేట, మీర్పేట్ కార్పొరేషన్లు) సమావేశం.. సరూర్నగర్ అశోక ఫంక్షన్ హాల్ లో జరిగింది.ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి కిచ్చెన్నగారి మాట్లాడుతూ… కులగణన ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు, సీట్ల కేటాయింపు ఉంటుందని చెప్పారు.మీ నాయకుడిని మీరే ఎన్నుకోండి అనే రాహుల్ గాంధీ గారి సిద్ధాంతంతో… రాష్ట్ర నాయకులను అబ్జర్వర్స్ గా పెట్టి గ్రామస్థాయికి పంపుతున్నారని కేఎల్ఆర్ చెప్పారు.అబ్జర్వర్స్ శివసేనారెడ్డి, థారసింగ్ మాట్లాడుతూ… పార్టీలో కష్టపడి పని చేసే నాయకులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.అనంతరం డివిజన్ల వారీగా విడివిడిగా భేటీ అయ్యారు.ఈకార్యక్రమంలో సరూర్నగర్ డివిజన్ అధ్యక్షులుగా బోయిని శంకర్ యాదవ్, ఆర్కేపురం డివిజన్ అధ్యక్షులుగా పున్నా గణేష్ నేతలు ఏకగ్రీవం కావటం వారిని కేఎల్ఆర్ అభినందించారు.*మీ నాయకుడిని మీరే ఎన్నుకోండి* *బడుగు బలహీన వర్గాలను బలోపేతం చేసేందుకే కులగణన, రిజర్వేషన్లు*

