నేటి సాక్షి గన్నేరువరం (బుర్ర అంజయ్య గౌడ్ ):గన్నేరువరం మండలం కేంద్రంలో సోమవారం రోజున తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లెల జగన్ మోహన్ ఆధ్వర్యంలో స్థానిక రైతుల తో కలిసి వడ్ల కొనుగోలు కేంద్రంను పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ రైతులు వడ్ల కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి పది రోజులు అవుతున్నదని, వడ్లు ఎండి తేమ శాతం కూడా వచ్చాయని, వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున వడ్లు తడిసి రైతలు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని, గౌరవ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి గౌరవ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అన్నారు. గ్రామం లో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, కుక్కలు వడ్ల మీద కప్పిన పరాదాలను చింపి వేస్తున్నాయని పెద్ద గాలులకు పరదాలు కొట్టుకుపోతున్నాయని రైతులు వాపోయారు. ఈ కార్యక్రమంలో కాంతాల కొండల్ రెడ్డి కాంతాల రాంభూపాల్ రెడ్డి కూన నర్సయ్య మిద్దె లచ్చిరెడ్డి చింతల మునీందర్ రెడ్డి కాంతాల సుమన్ రెడ్డి మందాల రాజకుమార్ పబ్బతి నీరజ వెదిర బొందవ్వ మందాల ఉమా రైతులు పాల్గొన్నారు.





