Thursday, March 12, 2026

వనం చెరువు బుంగ పూడ్చివేత

నేటి సాక్షి తొగుట సెప్టెంబర్ 7 :
తొగుట మండలంలోని వెంకట్రావుపేట వనం చెరువు తూము దగ్గర నుండి బయటకు నీళ్లు లీక్ అవుతున్నాయి. ఈ విషయమై స్పందించిన మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి
తహసీల్దార్ శ్రీకాంత్ తో, డి ఈ ఈ శ్రీనివాస్, ఏ ఈ ఈ అస్మా తో మాట్లాడటం జరిగింది. వారు లస్కర్లను పంపించారు.. వారు గడ్డి కట్టలు వేసినా నీళ్లు ఆగక పోవడంతో జేసీబీ స్వామి ని పిలిచి రైతులు, లస్కర్లతో కలిసి మట్టి వేయించి బుంగ పూడ్చి వేయడం జరిగింది. సహకరించిన లాస్కర్లకు, రైతులకు ఈ సందర్బంగా ధన్యవాదములు తెలియజేశారు. కార్యక్రమం లో లస్కర్లు సయ్యద్ పాషా, మల్లేశం, రామచంద్రం, శంకరయ్య, కే మల్లేశం, సత్యనారాయణ, నాయకులు బండారు స్వామి గౌడ్, పాత్కుల బాలేష్, జహంగీర్, పాత్కుల అశోక్, వెంకటేష్, ఎల్లం, మన్నె లక్ష్మి నర్సు, ఈదుగాళ్ల స్వామి, మల్లేశం తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News