Tuesday, March 10, 2026

వనపర్తి డీఈఓ పై చర్యలు తీసుకోవాలి – తెలంగాణ సామాజిక విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మీసాల లక్ష్మీనివాసు

నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్)

వనపర్తి జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ పాఠశాలలు విధివిధానాలు పాటించకపోవడంపై తెలంగాణ సామాజిక విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు ఈరోజు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ (ఐఏఎస్)ని కలిశారు.ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మీసాల లక్ష్మీనివాసు మాట్లాడుతూ:–వనపర్తి జిల్లా డీఈఓ విద్యాశాఖ నిబంధనలను పాటించకపోతున్నారన్నారు.ముఖ్యంగా పాఠశాల ముందు స్థలంలో టెక్నో టాలెంట్ గ్రామర్ అనే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను నిర్మాణం పూర్తికాని భవనంలో చదివిస్తుండటంతో పాటు,ఖరీదైన పుస్తకాలు అమ్మించడం కొనసాగుతోందని ఆరోపించారు.ఈ అంశాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా డీఈఓ స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.సమావేశంలో డైరెక్టర్ స్పందిస్తూ – పూర్తి సమాచారం జిల్లా కలెక్టర్ నుంచి పొందిన తరువాత,తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మానాజీ పేట్ రమేష్ గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బెస్త యాదగిరి,రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News