నేటి సాక్షి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ప్రతినిధి మార్చ్ 12 అడవులు వన్యప్రాణాల సంరక్షణలో మీడియా పాత్ర కీలకమని కొమరం భీమ్ ఆసిఫాబాద్ డి ఎఫ్ ఓ నీరజ్ కుమార్ టేబ్రీవన్ అన్నారు గురువారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ రేంజ్ పరిధిలో మా కోడి ఇటిక్యాల పాడు సెక్షన్ లో అడవుల వన్యప్రాణాలు సంరక్షణపై మీడియా పాత్ర వర్క్ షాప్ లో ఆసిఫాబాద్ డి ఎఫ్ ఓ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు సిర్పూర్ రేంజ్ పరిధిలో లో 1000 ఎకరాల ప్లాంటేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపినారు ప్రాణహిత నది పరిసరాల ప్రాంతం కావడంతో పులులు ఆవాస ప్రాంతంగా ఇటిక్యాల పహాడ్ ఉందన్నారు మహారాష్ట్ర నుండి తడోబా అడవి ప్రాంతం నుంచి ఇటిక్యాల పహాడ్ వస్తున్నట్లు తెలిపినారు అడవుల సంరక్షణ అభివృద్ధి అటవీ అధికారుల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపినారు అనంతరం డి ఎఫ్ ఓ అప్పయ్య మాట్లాడుతూ పులులు ఆవాసాల కేంద్రంగా ఇటిక్యాల పహాడ్ ఉందని అడవుల సంపదను కాపాడాల్సింది బాధ్యత అందరిపై ఉందన్నారు కాగజ్నగర్ డివిజన్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లు ఆయన తెలిపినారు అటవీ అభివృద్ధి కి ప్రజలు సహకరించాలని కోరారు అలాగే అడవి జంతువులను నీరు అందే విధంగా బోర్లు వేస్తూ సోలార్ కరెంటుతో నీటి ఉటాలను నిర్మించడం జరిగింది బోర్లు వేస్తూ వాటి ద్వారా వచ్చే నీరు జంతువులకు ఉపయోగపడేలా కృషి చేస్తున్నామని ఆయన తెలిపినారు అడవిలో జంతువులు పక్షులు ఎప్పటికీ నీటి కొదవ పడకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగే కొన్ని ఉటాలు ప్రకృతి పరంగా ఉన్న వాటిని సద్వినియోగం చేసుకుంటున్నామని ఆయన తెలిపినారు మహారాష్ట్రలో తడోబా ప్రాంతం ఎలా అభివృద్ధి చెందిందో కాగజ్నగర్ డివిజన్లో ఇటిక్యాల పహాడ్ నో అలాగే అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బి వెంకట్ ట్రైన్ ఐఎఫ్ఎస్సి ఆఫీసర్ భార్గవ్ సిర్పూర్ రేంజ్ అధికారులు ఎఫ్ ఆర్ ఓ ప్రవీణ్ కుమార్ బెజ్జూర్ రేంజ్ అధికారి ముసవీర్ డిప్యూటీ రేంజ్ అధికారి శ్రవణ్ కుమార్ కాగజ్నగర్ ఎఫ్ఆర్ఓ అనిల్ కుమార్ మా కోడి సెక్షన్ ఆఫీసర్ మోహన్ రావు కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని రేంజ్ అధికారులు అటవీ సిబ్బంది తదితరులు మరియు మీడియా మిత్రులు పాల్గొనడం జరిగింది




