Monday, December 23, 2024

వన మహోత్సవంలో భాగస్వామ్యులు కావాలి

  • వేమనపల్లి ఎంపీటీసీ సంతోష్​కుమార్

నేటిసాక్షి, వేమనపల్లి : తెలంగాణ వన మహోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఎంపీటీసీ సంతోష్ కుమార్, తహసీల్దార్​ రమేష్, ఎంపీవో అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం నీల్వాయి గ్రామ పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాతమకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో వారు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని సూచించారు. మండల పంచాయతీ అధికారి అనిల్ కుమార్ మాట్లాడుతూ 14 గ్రామ పంచాయతీల్లో వారం రోజులు పాటు నిర్వహించనున్న మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మొక్కల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఇంటికి 6 పండ్ల మొక్కల చొప్పున 31170, ఇతర ప్రదేశాల్లో 58430 మొత్తంగా 89600 మొక్కలు నాటాల్సి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సత్యప్రసాద్, ఈసీ మధుకర్, సాంకేతిక సహాయకులు కృష్ణ మోహన్, లక్ష్మణ్ పంచాయతీ కార్యదర్శి అశోక్, మాజీ కో–ఆప్షన్ సభ్యులు సాబీర్​ అలీ, మాజీ సర్పంచులు గాలి మధు, తిరుపతి రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఒడిల రాజన్న, మాదిగ దండోరా జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News