Sunday, March 15, 2026

*వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం*..

నేటి సాక్షి (జిన్నారం) జిన్నారం మున్సిపాలిటీ జిన్నారం, ఉట్ల గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన వ్యవసాయ సహకార సంగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు, కేంద్రాన్ని స్థానిక మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించిన ఏ పీ ఎం సతీష్. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూప్రజా పాలన ప్రభుత్వంలో రైతులకు పెద్దపీట వేస్తున్న రైతు ప్రభుత్వమని తెలిపారు.కావున రైతులు అందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించాలని విజ్ఞప్తి చేశారు.రైతులకు మేలు జరిగే విధంగా 500 రూ బోనస్ తో మంచి లాభాలతో రైతుల కుటుంబాలు సంతోషంగా చూడాలని ప్రభుత్వ ఉద్దేశమని, రైతే రాజుగా తెలంగాణ రాష్ట్ర వెన్నుముక్కగా చూడాలన్నదే ప్రభుత్వం నిర్ణయం.రైతులు అందరూ ప్రభుత్వం అందిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హార్దిక అభివృద్ధి సాధించాలని కోరుతున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, వైస్ ఎంపీపీ గంగు రమేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు రాజు గౌడ్,ఊట్ల మాజీ సర్పంచ్ శివరాజు, ఉప సర్పంచ్ జింకల రవి, వీరభద్ర స్వామి ఆలయ డైరెక్టర్ పూజారి కృష్ణ, మహేందర్ రెడ్డి, జాంగిరీ రెడ్డి, మోత్త కృష్ణ, పట్నం శ్రీనివాస్, నాగరాజు, పల్నాటి భాస్కర్,యనగండ్ల నరేందర్, మహేష్గంగు రాజు, సీతారాం,శంకరయ్య, శ్రీనివాస్, నాయకులు ఐకెపి సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News