Wednesday, March 18, 2026

వరి రైతులకు నేరుగా వడ్ల బస్తాలు ఇవ్వాలి అవకతకాలకు తావులేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ కు వినతి…

నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 14, రైతులకు సరిపడా సంచులు అందుబాటులో ఉంచాలని కల్లాల నుండి కొనుగోలు కేంద్రాల దగ్గరకు తీసుకురావడానికి రైతులకు ఖాళీ సంచులు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ఏ ఓ శ్రీధర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు కల్లాల దగ్గరకు ఖాళీ సంచులు ఇచ్చుటకు నిరాకరించడం వల్ల రైతులకు అదనపు రవాణా చార్జీలు అవుతాయి కాబట్టి తమరు స్పందించి రైతుల కల్లాల దగ్గర నుండి కేంద్రాల వరకు తీసుకొచ్చేందుకు ఖాళీ సంచుల్ని రైతులకు ఇచ్చేటట్లు ఆదేశించాలని కోరారు.అదేవిధంగా గతంలో అనేక సందర్భాల్లో మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మకై రైతుల యొక్క ధాన్యాన్ని తరుగు తాలు పేరుతో అధిక కాటాలు వేసి రైతుల్ని నిలువున దోచుకున్నారని అన్నారు కేంద్రాలను అధికారులు పర్యవేక్షించి రైస్ మిల్లుల దగ్గర ఉన్నటువంటి కాటాలను సరిచూడాలని కోరారు.ఈ కార్యక్రమం లో నాయకులు నర్సిహ్మ,దస్తప్ప,మల్లేష్,హన్మంతు, బింపూర్ హన్మంతు,నరహరి,అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News