నేటి సాక్షి, నారాయణపేట, నవంబర్ 25, రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికల ద్వారా సరఫరా చేస్తున్న సబ్సిడీ వరి విత్తనాలను అరికల్ మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి మహమ్మద్ రహిమాన్ ఖాన్ తెలిపారు. మంగళవారం మరికల్ మండల కేంద్రంలోని వ్యవసాయ రైతు వేదికలో రైతులకు సబ్సిడీపై అందజేస్తున్న చేస్తున్న వరి విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి రహిమాన్ మాట్లాడుతూ 27 క్వింటాలు మంజూరయ్యా అన్నారు. 575 సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుందన్నారు. యువసేన అధికారులు పరుశురాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్య మోహన్ రెడ్డి, వీరన్న, రామన్ గౌడు, హరీష్ కుమార్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు





