Sunday, March 15, 2026

వర్షంతో శిధిలమైన ఇల్లు – అవస్థలు పడుతున్న ఎస్సీ కాలనీ వ్యక్తి..

నేటి సాక్షి మహబూబాసాక్షి మహబూబాబా ద్ (బి.ఆర్. నాయక్) అక్టోబర్ 29 మహబూబాబా ద్ జిల్లాలో శిరోల్ మండలం కంపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో నివసిస్తున్న కొమ్ము ఉప్పలయ్య తండ్రి దుర్గయ్య తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఆయనకు ఉన్న పాత శిధిల గృహం కూలిపోయింది. ఇప్పటికే ఆ ఇంటి నిండా వర్షపు నీటితో ఉండిపోవడంతో ఆయనకు ఉండడానికి స్థలం లేకపోవడంతో పాటు తినడానికి ఆహారం కూడా లేక తీవ్ర అవస్థలు పడుతున్నాడు. ప్రభుత్వం మరియు స్థానిక అధికారులు ఈ పరిస్థితిని గమనించి కొమ్ము ఉప్పలయ్యకు తక్షణ సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News