నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల) బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వర్షాలు కురుస్తున్న తరుణంలో నగరంలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే సాయం అందించేందుకు అన్ని విభాగాల అధికారులు అందుబాటులో అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్, జాయింట్ కలెక్టర్ ఎన్. మౌర్య నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో నగరంలోని అండర్ బ్రిడ్జిలతో పాటు మధురా నగర్ తదితర ప్రాంతాలను నగరపాలక సంస్థ అధికారులతో కలసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్ 26 నుండి 30 వ తేదీ వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ వర్షాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సాయం అందించేందుకు అందరు అధికారులు అందుబాటులో ఉండాలని తెలిపారు. కార్యాలయంలో 24గంటల పాటు టోల్ ఫ్రీ నంబర్లు 0877 – 2256776, 9000822909 లో అందుబాటులో ఉంటారని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసామని, అక్కడే వసతి, ఆహారం పదారతాలు అందిస్తారాణి తెలిపారు. వర్షాల వలన త్రాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి, నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. పరీక్షలు నిర్వహించి, క్లోరినేషన్ చేయాలనీ తెలిపారు. ఎక్కడైనా నీటి కలుషితం జరిగితే సరఫరా ఆపి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. ప్రజలు కాచి వాడగట్టిన నీరు తాగాలని తెలిపారు. ఎక్కడైనా రోడ్లు గుంతలు పడితే, వెంటనే పూడ్చాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మురికినీటి డ్రైనేజీ కాలువల్లో ఎప్పటికప్పుడు చెత్త తొలగించి నీరు రోడ్లపైకి రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మ్యానహోల్ ఓపెన్ చేసిన ప్రాంతాల్లో ను, అండర్ బ్రిడ్జిల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అండర్ బ్రిడ్జిల వద్ద వర్షపునీరు ఆగకుండా మోటార్లతో నీరు పంపింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపైన చెత్త కుప్పలు, అక్కడ ఉన్న బురద తొలగించి బ్లీచింగ్ చల్లాలని తెలిపారు. ఎక్కడైనా చెట్లు పడేలా ఉన్నా, విద్యుత్ అంతరాయం ఏర్పడినా కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని తెలిపారు. పురాతన భవనాల్లో నివాసం ఉండొద్దని ప్రజలకు సూచించారు. నగరపాలక సిబ్బంది రైన్ కోట్లు, రేడియం స్టిక్కర్ జాకెట్లు ధరించి విధులు నిర్వహించాలని ఆదేశించారు.అన్ని విబాగాల అధికారులు సమన్వయం చేసుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు.కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ గోమతి, డి.ఈ.రమణ, తదితరులు ఉన్నారు.





