Tuesday, March 10, 2026

వలస కార్మికుల సమాచారంపై దృష్టి

ఎస్సై బి తిరుపతి రెడ్డి

నేటి సాక్షి, బెజ్జంకి:

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలకేంద్రంలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చి జీవనోపాధి కోసం స్థిరపడిన వలస కూలీల కుటుంబాలతో ఎస్సై కమ్యూనిటీ పోలీసింగ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ అధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై బద్దిపడగ తిరుపతి రెడ్డి వలసకూలీలతో ముఖాముఖీగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వారు నివసించే ప్రాంతాల్లో చట్టసమ్మతమైన పత్రాలు ఉండాలనే సూచనలు చేశారు. అజ్ఞాత వ్యక్తులపై ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.అలాగే భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచేలా సూచనలు చేశారు. పిల్లలకు విద్య అవసరం,బాల కార్మికత్వాన్ని నివారించాలన్న సందేశం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వలసకూలీలు, స్థానిక యువత,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News