నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 2, నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని తిరుమల ఫంక్షన్ హాల్ లో ఆదివారం చెందిన పి. వెంకట్ రాములు ఆధ్వర్యంలో వలస బతుకులు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హైకోర్టు జడ్జి సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వలసలపై పుస్తకను మహా అద్భుతంగా రాశారని వారు అన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ పుస్తకం ను చదవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో హరగోపాల్, హైమావతి, సుదర్శన్, సూర్య మోహన్ రెడ్డి, వెంకట్ రాములు, ప్రభాకర్, శ్రీనివాసులు, మరికల్ మాజీ సర్పంచులు లక్ష్మయ్య, లక్ష్మీ రామస్వామి, నాయకులు మేధావులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.





