నేటి సాక్షి, నల్లబెల్లి జనవరి 02 :నల్లబెల్లి మండలం,రుద్రగూడెం గ్రామంలో బాటను ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గంగారపు లింగయ్య తీవ్ర నిరసనకు దిగారు. రుద్రగూడెం గ్రామ వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడం సంచలనంగా మారింది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న నల్లబెల్లి ఎస్సై గోవర్ధన్ వెంటనే రుద్రగూడెం గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

