నేటి సాక్షి ప్రతినిధి,మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్) మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి – సూచన మేరకు *జైబాపు జైభీమ్ జైసంవిధాన్* కార్యక్రమాన్ని నిర్విరామంగా కాంగ్రెస్ శ్రేణులు నిర్వహిస్తున్నాయి.ఈరోజు మహేశ్వరం, కందుకూరు, తుక్కుగూడ మున్సిపాలిటీలో వాడవాడకు పాదయాత్ర చేసి జైభీమ్ అంటూ నినాదాలు చేశారు.కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగంపై చేస్తున్న దాడిని వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.ఈకార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.

