నేటి సాక్షి – జగిత్యాల (పూరెళ్ల బాపు)……………………………………జగిత్యాల జిల్లాలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఎగురవేసి ఘనంగా జరుపుకున్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరెట్, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో కలెక్టర్ సత్యప్రసాద్ జాతీయ జెండా ఎగురావేశారు.పోలీస్ హెడ్ క్వార్టర్ లో ఎస్పీ అశోక్ కుమార్ జాతీయ జెండా ఎగురవేయగా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అంబేద్కర్ చౌరస్థలో జెండాను ఎగురావేయగా, ఇందిరా భవన్ లో డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య, పాత బస్టాండ్ చౌరస్థలో బీజేపీ నాయకులు సిపెల్లి రవీందర్, ఏసి ఎస్ రాజు, అరవ లక్ష్మి లు,జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో డాక్టర్. సుజాత,పోలీస్ స్టేషన్లలోస్లేట్ హైస్కూల్, సూర్యగ్లోబల్ స్కూల్, అకాడమీక్ హైట్స్ పాఠశాల,జగిత్యాల ప్రభుత్వ కొత్తవాడ హైస్కూల్,జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, రాయికల్, ధర్మపురి మున్సిపల్ వార్డుల్లో జెండా వందనం పండుగ సందర్బంగా జెండాను ఎగురవేసి స్విట్లు పంపిణి చేశారు.గ్రామపంచాయతీల్లో పంచాయతీ కార్యదర్శులు జాతీయ జెండాను ఎగురావేశారు.జగిత్యాల పట్టణంలోని పూరానిపేట గాంధీ విగ్రహం వద్ద అవారి శివకేసరి బాబు జెండా ఎగురవేయగా చెట్ల రవీందర్, కైలాసం, నలుమాస్ గంగాధర్, చెట్ల జానకి, బట్టు సుజాత, జక్కం సరితలు పాల్గొన్నారు.జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చీటీ శ్రీనివాస్ రావు,ఎం డీ ఇమ్రాన్, ప్రెస్ క్లబ్ లో అధ్యక్షులు ఎల్లాల రాజేందర్ రెడ్డి,ఎన్నం కిషన్ రెడ్డి లు జెండా ఎగురావేశారు.కలెక్టరెట్, ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో చిన్నారులు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు అహుతులను అలరించాయి.





