Friday, March 20, 2026

వాయల్పాడులో ఎక్స్‌ప్రెస్ రైలు స్టాప్ కోసం ప్రజల ఎదురుచూపు..ఎంపీ మిథున్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి చర్చించిన శుభ వేళ..

నేటి సాక్షి అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 11 ~అన్నమయ్య జిల్లా :-: వాయల్పాడులో ఎక్స్‌ప్రెస్ రైలు స్టాప్ కోసం ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీనిపై రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పెద్ద మనసుతో స్పందించారు. వాయల్పాడు పట్టణ ప్రజల ఎన్నాళ్లకు గానో ఎదురుచూస్తున్న పరిష్కారానికి ప్రతిస్పందనగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వాయల్పాడు రైల్వే స్టేషన్‌లో ఎలాంటి ఎక్స్‌ప్రెస్ రైలు ఆగకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నుండి తిరుపతికి వెళ్లాలన్నా కలికిరికి వెళ్లాల్సిందే. అనంతపురం, హైదరాబాద్ వైపు వెళ్లాలన్నా మదనపల్లికి చేరుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల వాయల్పాడు పట్టణాన్ని సందర్శించారు. సందర్శన సందర్భంగా స్థానిక యువ నాయకుడు చింతల సాయి కృష్ణారెడ్డి ప్రజల తరపున వాయల్పాడులో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు అత్యవసరమని ఎంపీ మిథున్ రెడ్డి కి విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యలను సమగ్రంగా వివరించిన సాయి కృష్ణారెడ్డి అభ్యర్థనను ఎంపీ తీవ్రంగా పరిగణమించారు. ప్రస్తుతం రాజ్యసభ సమావేశాల్లో భాగంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గురువారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాయల్పాడు రైల్వే స్టేషన్ ప్రస్తావనను తీసుకొచ్చారు. ఎక్స్ ప్రెస్ రైలు ఇక్కడ ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉద్యోగులు, విద్యార్థులు, దూర ప్రాంతాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వివరిస్తూ ఇక్కడ ఎక్స్ ప్రెస్ రైలు ఆపే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతూ అధికారిక వినతిపత్రమందజేశారు. ప్రజా డిమాండ్ మేరకు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పలు రైల్వే స్టేషన్లలో రిక్వెస్ట్ స్టాప్‌లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో ముఖ్యంగా వాయల్పాడు పట్టణంకు ప్రాధాన్యత నివ్వాలని రైల్వే శాఖ మంత్రి కి తెలియజేశారు.సెవెన్ హిల్స్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, నర్సాపూర్ – ధర్మవరం ఎక్స్‌ప్రెస్..సెవెన్ హిల్స్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, నర్సాపూర్ – ధర్మవరం ఎక్స్‌ప్రెస్ రైళ్లకు వాయల్పాడులో రిక్వెస్ట్ స్టాప్ ఇవ్వాలని స్పష్టంగా ప్రతిపాదించిన నేపథ్యంలో వాయల్పాడు వాసులు హర్షం వ్యక్తం చేశారు. ప్రాంత ప్రజల తరపున తమ సమస్యలను పై స్థాయి వరకు తీసుకెళ్లిన యువ నాయకుడు చింతల సాయి కృష్ణారెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఆయన తీసుకున్న నిర్ణయానికి అలాగే వెంటనే స్పందించి కేంద్రానికి ప్రతిపాదన పంపిన ఎంపీ పీవీ మిథున్ రెడ్డి కి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. వాయల్పాడులో ఎక్స్‌ప్రెస్ రైలు స్టాప్ కోసం అధికారిక నిర్ణయం త్వరలో వెలువడుతుందన్న ఆశాభావం స్థానికుల్లో వ్యక్తమవుతోంది..~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News