*నేటి సాక్షి-మేడిపల్లి* భీమారం మండలం లోని గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమాన్ని మన్నెగూడెం రైతు వేదికలో ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. ఈ ఐదు రోజుల కార్యక్రమంలో భీమారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల వార్డు సభ్యులు పాల్గొననున్నారు. అందులో భాగంగా మంగళవారం రోజున మన్నెగూడెం లోని రైతు వేదిక లో ఈ శిక్షణా కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం వార్డు సభ్యులకు తమ బాధ్యతలు, గ్రామాభివృద్ధి పథకాలు, పంచాయతీ రాజ్ వ్యవస్థలో పాత్ర, ఆర్థిక నిర్వహణ, మహిళా సాధికారత, అంశాలపై అవగాహనా కల్పించనున్నారు. మొదటి రోజు వార్డు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఇట్టి కార్యక్రమం లో భీమారం ఎంపిడిఓ, ట్రైనర్స్, పంచాయతీ కార్యదర్శులు అధికారులు పాల్గొన్నారు.

