నేటి సాక్షి చిలుకూరు.* చిలుకూరు మండల పరిషత్ కార్యాలయంలో వార్డు సభ్యులకు శిక్షణ ఇస్తున్న ఎంపీ ఓ చిలుకూరు వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని ఎంపీ ఓ ముక్కపాటి నరసింహా రావు అన్నారు చిలుకూరు మండల పరిషత్ కార్యాలయంలో వార్డు సభ్యులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. వార్డు సభ్యులు తమ విధులను బాధ్యతలన తెలుసుకొని అందుకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన తమ హక్కులను వినియోగించుకోవాలని అన్నారు మండలంలోని వార్డు సభ్యులకు రెండు విడుదలుగా శిక్షణ ఇస్తున్నట్లు గా తెలిపారు 20వ తేదీ వరకు మొదటి విడత 23 నుండి 27వ తేదీ వరకు రెండో విడత వార్డు సభ్యులకు శిక్షణ ఇస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రైనర్ వెంకటనారాయణ అక్షయ్ తేజ మల్లారెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ….





