నేటి సాక్షి – మల్లాపూర్*( మహేష్ పెంబి )పురాతన శ్రీ రామలింగేశ్వర ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. రత్న పద్మావతి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు, అభిషేకంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో జడ్జిని స్వాగతించి గర్భగుడిలో పూజలు నిర్వహించారు.ఆలయ చరిత్ర, పురాతనతపై అర్చకులు ఆమెకు వివరాలు తెలియజేశారు. అనంతరం ఆలయ తరఫున శాలువా కప్పి సన్మానించి, దేవాలయం ప్రతిమను బహుకరించారు.ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి యస్. నారాయణ, మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు, జూనియర్ సివిల్ జడ్జిలు నారం అరుణ్ కుమార్, కాసుల్ల పావని, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.______





