Monday, January 19, 2026

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో పునరుద్ధరించాలి

వాల్మీకి సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ మండ్ల దేవన్న నాయుడు

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి :

ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అయ్యా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాము. వాల్మీకి బోయలు కూడా గతంలో ఎస్టీలుగా కొన సాగాము కనుక బోయలను కూడా ఎస్సీ ఎస్టీ వర్గీకరణలో పరిగణాలకు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి బోయలను ఎస్టీ జాబితాలో పునరు ద్ధరించాలని .శుక్రవారం ఈ సందర్భంగా వాల్మీకి సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ మండ్ల దేవన్న నాయుడు వాల్మీకి సంఘం జిల్లా నాయకులు బుసిరెడ్డి స్వామి ప్రభుత్వాన్ని కోరారు. వనపర్తిలో మీడియాతో దేవన్న నాయుడు మాట్లాడుతూ. దేశంలో చాలా రాష్ర్టాల్లో షెడ్యూల్డ్‌ ట్రైబల్స్‌గా.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని కొన్ని జిల్లాల్లో గిరిజన తెగలు గా.. మరికొన్ని జిల్లాలో బీసీ- ఏలుగా, పరిగణిస్తున్నారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 1968 వరకు బోయలు అడవుల్లోంచి వచ్చిన ట్రైబ్‌లుగా, ఎస్టీలుగా గుర్తించింది. ఆ తర్వాత రాజకీయ కారణాలతో గిరిజన జాబితా నుంచి తొలగించారు. కొన్ని ప్రాంతాల్లో వీరిని వాల్మీకి, తలారి, కావలి, కిరాత, నిషాద, గురికార, పెద్దబోయ, చిన్న బోయ, యల్లాపి, నాయకర్‌ అని పలురకాల పేర్లతో పిలుస్తారు.భారత రాజ్యాంగ చట్టం 1951 జి.ఓ.ఎం. ఎన్‌ 1527/1951 ప్రకారం వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించింది. 1968 వరకు బోయలు ఎస్టీలోనే కొన సాగారు. ఉమ్మడి ఏపీలోని రాయలసీమ ప్రాంతంలో వాల్మీకి ఉన్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో వాల్మీకి బోయల జనాభా ఆరు లక్షల పైచిలుకు ఉన్నారు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న వాల్మీకి బోయలు ఎటువంటి కులవృత్తి లేని బోయలు ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాల్లో వెనుకబడి ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే షెడ్యూల్ (ఎస్టీ ) జాబితాలో చేర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. వాల్మీకి బోయలను ఎస్టి జాబితాలో గత బి ఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల హయాంలో మాయ మాటలతో మోసం చేసిందని, కెసిఆర్ వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేరుస్తానని తూతూ మంత్రంగా అసెంబ్లీలో తీర్మానం చేసి ఒకసారి ముస్లిం మైనార్టీ .వాల్మీకి బిల్లు కలిపి కేంద్రానికి పంపాడు మరోసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాలి వర్గాన్ని కూడా ఎస్టీ జాబితాలో కలపాలని మరోసారి కేంద్రానికి పంపారు బిఆర్ఎస్ . బిజెపి . ఇరు పార్టీలు మద్దెల వాల్మీకి బోయలు బలైపోయామని మండ్ల దేవన్న నాయుడు ఆవేదనపడ్డారు. బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌ ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి pgoo43 వాల్మీకుల కు ఎమ్మెల్సీ ఇస్తున్నారు.రాష్ట్ర లో రెండు కార్పొరేషన్ చైర్మన్ లను అభ్యున్నతికి వాల్మీకి బోయలకు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక చొరవ తీసుకుంటాడని . ఎస్టి జాబితాలో చేరుస్తారని మాకు చాలా నమ్మకం ఉందని అన్నారు .ఈ కార్యక్రమంలో. మండ్ల బలరాం. శేఖర్ నాయుడు. వాల్మీకి నాయకులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News