Monday, March 16, 2026

వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య….

నేటి సాక్షి,నారాయణపేట,నవంబర్ 5, నారాయణపేట జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఎస్సై కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహించి సరియైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధిస్తూ వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై కృష్ణ చైతన్య మాట్లాడుతూ… వాహనదారులు తప్పకుండా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు సరైన పత్రాలు కలిగి ఉండాలని తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో తప్పకుండా హెల్మెట్, సిట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. మితిమీరిన వేగంతో వాహనాలను నడపరాదు అని, రాష్ డ్రైవింగ్ చేయరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, త్రిబుల్ రైడింగ్ చేయరాదు, వాహనాలకు సంబంధించిన ఆర్సి, లైసెన్స్ ఇన్సూరెన్స్ తప్పకుండా కలిగి ఉండాలని ఎస్ఐ గారు తెలిపారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించి పోలీసు వారికి సహకరించాలని ఎస్ఐ గారు తెలిపారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News