Saturday, March 21, 2026

*వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు విధిగా పాటించాలి: ఎస్సై భక్తవత్సలం*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*రామచంద్రాపురం*ప్రతి వాహన చోదకులు రోడ్డు భద్రత నిబంధనలను విధిగా పాటించాలని ఎస్సై భక్తవత్సలం అన్నారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ద్విచక్ర వాహన చోదకులు విధిగా హెల్మెట్ ను ధరించాలన్నారు. హెల్మెట్లు ధరించకపోతే గతంలో ఫైన్ రూ. 135 ఉండేదని ప్రస్తుతం రూ. 1030 గా మార్చారన్నారు. డ్రైవింగ్ లైసెన్సులు లేకపోతే 5000 రూపాయలు ఫైన్ విధించినట్లు పేర్కొన్నారు. హెవీ వెహికల్ కు రూ. 10000 అపరాధం వేస్తారన్నారు. మైనర్లు ద్విచక్ర వాహనాలను నడిపితే వారితోపాటు వాహనాలను ఇచ్చిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News