Monday, March 16, 2026

*వాహనాలను అతివేగంగా నడప వద్దు** కర్లపాలెం ఎస్సై రవీంద్ర

నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం)మోటారు వాహనాలను నడిపేవారు పరిమిత వేగంతో నడపాలని ద్విచక్ర మోటార్ వాహనాలపై వెళ్లేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కర్లపాలెం ఎస్సై రవీంద్ర చెప్పారు. ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం కర్లపాలెం కూరగాయల మార్కెట్ వద్ద జాతీయ రహదారిపై ప్రజలకు అవగాహన కల్పించారు. రవీంద్ర మాట్లాడుతూ కారులో ప్రయాణించేవారు సీటు బెల్టు పెట్టుకోవాలని చెప్పారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని అవగాహన కల్పించారు. పరిమిత వేగంతో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలను చేరుకోవాలని చెప్పారు. ఆయన వెంట ట్రైనింగ్ ఎస్సై, కానిస్టేబుల్, పోలీస్ సిబ్బంది ,తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News