Monday, March 16, 2026

వికలాంగుడికి అండగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

( నేటిసాక్షి ప్రతినిధి మహేశ్వరం అక్టోబర్ 14:)* రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఓ వృద్ధ వికలాంగుడు తన ఇబ్బందులను వివరించేందుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చాడు.ఈ సందర్భంగా మాజీ మంత్రి,మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి ని కలసి సహాయం కోరాడు.వికలాంగుడి పరిస్థితి తెలుసుకున్న సబితా ఇంద్రారెడ్డి వెంటనే స్పందించి, వారం రోజుల్లో బ్యాటరీతో నడిచే మూడు చక్రాల వాహనం అందజేస్తాను అని హామీ ఇచ్చారు.అలాగే మీకు,మీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి,మాజీ కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆదిల్ అలీ,పి.ఏ.సి.ఎస్ డైరెక్టర్ కాడమోని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News