నేటి సాక్షి,కోరుట్ల టౌన్*(గణేష్ గొల్లపల్లి)కోరుట్ల పట్టణంలోని శ్రీ సాయిరాం దేవాలయంలో శనివారం కోరుట్ల పట్టణ వికలాంగుల ఆధ్వర్యంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు స్వీట్ పంపిణీ చేసుకొని సంబరాలు జరుపు కున్నారు. అలాగే ఈ సందర్భంగా వికలాంగులు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వొడ్నాల శ్రీనివాసరావు, సదుల మనోజ్ కుమార్, ఎం జె ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెట్టుపల్లి లక్ష్మణ్, మంగ సాయి నిఖిల్, ఎం.డి. ఫారూఖ్ భాయ్, గట్ల సాయి ప్రసాద్,, ఎం.డి. ఇంతియాజ్, మాజీ కౌన్సిలర్ పేర్ల సత్యం, రాజు, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు




