నేటి సాక్షి 02మార్చి పాములపాడు:- పాములపాడు లోని, మండలం ప్రజా పరిషత్ కార్యాలయం దగ్గర ఏపీఓ-బి.జయంతి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ జి రామ్ జి గ్రామీణాభివృద్ధికి నూతన సంకల్పం ఉపాధికి కొత్త హామీ పథకం అవగాహన పోస్టర్లను ఎంపీడీవో యన్.చంద్రశేఖర్, బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్, ఫీల్డ్ అసిస్టెంట్ జె.లింగస్వామి, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కే.అంకన్న, ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రేమ రాజు, మహిళా సంఘాల నాయకులతో, ఉపాధి హామీ శ్రామికులతో అవగాహన పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో- ఎన్.చంద్రశేఖర్, ఏపీవో- బి.జయంతి, బిజెపి మండల అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్ లు అవగాహన కల్పిస్తూ వికసిత్ భారత్- జి రామ్ జీ ఉపాధి హామీ పథకంలో శ్రామికులకు 125 రోజుల పని, పని కల్పించని ఎడల నిరుద్యోగ భృతి కోసం మెరుగైన ఏర్పాటు, సమయానికి కూలి చెల్లింపు, ఆలస్యమైతే చెల్లింపులకు పరిహారము కల్పించడం జరుగుతుందన్నారు. పనుల గుర్తింపు కోసం గ్రామ సభ ద్వారా వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళిక రూపొందించడం జరుగుతుందన్నారు. వికసిత్ గ్రామపంచాయతీ ప్రణాళికలో అన్ని పథకాలు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో శక్తివంతంగా, మెరుగైన ఉపాధి హామీతో, దృఢమైన నిబద్ధతతో, సవర్థ పాలన అదే వికసిత్ భారత్ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పొదుపు మహిళా సంఘాల నాయకులు, ఉపాధి హామీ శ్రామికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొనడం జరిగింది..





