Saturday, March 7, 2026

వికారాబాద్ జిల్లాలో గత సంవత్సరం కంటే స్వల్పంగా 2025లో క్రైమ్ రేట్ పెరిగాయి.వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర.

నేటి సాక్షి వికారాబాద్ :వికారాబాద్ జిల్లాలో నేరాలు గత సంవత్సరం తో పోలిస్తే 3691 ప్రస్తుత సంవత్సరంలో 3813 కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే 122 కేసులు నమోదయ్యాయి. 2024 సంవత్సరంలో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో తీవ్రమైన కేసులు నమోదు స్వల్పంగా మొత్తం 5 కేసులు తీవ్రమైన కేసులు పెరగడం జరిగింది. ప్రాపర్టీ రికవరీ కేసులలో గత సంవత్సరంలో 44.01% పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో 52.5% రికవరీ చేయడం జరిగింది. 2024 సంవత్సరంలో మర్డర్ కేసులు 1 ప్రస్తుత సంవత్సరంలో 4డిటెక్టెడ్ కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే మహిళలపై కేసులు 363 ప్రస్తుత సంవత్సరాల్లో 364 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరాలు ప్రస్తుతం ఒక ప్రధాన సవాల్ గా మారాయి. సైబర్ నేరగాల తమ గుర్తింపు ఉన్న ప్రదేశాలను దాచడానికి ఆధునిక సాంకేతిక పద్ధతులను తరచుగా వినియోగిస్తున్నారు. సాంకేతిక నిరంతరం మారుతూ ఉండటంతో పోలీసు బలగాలు తమ నైపుణ్యాలను సాధనాలను ఎప్పటికప్పుడు సవరించుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాలో మొత్తం 184 కేసులు ఎఫైర్లుగా నమోదు చేయబడ్డాయి. న్యాయస్థానం నుండి మొత్తం 91,76,248 విలువైన రిఫండ్ ఆదేశాలు పొందపరిచినాయి. ఆపరేషన్ ముస్కాన్ 2025లో వికారాబాద్ జిల్లా పోలీసులు ప్రత్యేక మూడు బృందాలను ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లా పోలీసులు మొత్తం 39 ఎఫ్ఆర్ లు నమోదు చేసి 311 మంది పిల్లలను వీరిలో 284 మంది బాలురు, 27 మంది బాలికలు ఉన్నారు. పిల్లల రక్షణలో పోలీసులు అప్రమత్తంగా నిబంధనతో ఈ విజయం సాధించారు. జిల్లాలో షీ టీం పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించడానికి మహిళలపై జరుగుతున్న నేరాలు తగ్గించడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాల కళాశాలలో డయల్ 100 మహిళలపై నేరాలు ఎన్ డి పి ఎస్ చట్టంపై చురుకుగా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాలలో మొత్తం 224 అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. జిల్లాలోని మహిళలు బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పనిచేస్తుంది. ఈ విభాగం పాఠశాలలో కళాశాలలో విజయవంతంగా 152 అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. హత్య కేసులు ప్రస్తుత సంవత్సరంలో మొత్తం 25 కేసులు నమోదయ్యాయి వాటిలో 24 కేసులు సంబంధించి నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు పంపడం జరిగింది.అత్యాచార కేసులు ప్రస్తుత సంవత్సరంలో మొత్తం 63 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఈ 63 మంది నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపడం జరిగింది. తద్వారా 100% కేసులు పరిష్కారం డి టెన్షన్ రేటు నమోదయింది. జిల్లాలో పెద్ద మొత్తంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నందుకు సంబంధించి మొత్తం 24 కేసులు నమోదయ్యాయి. అధికారులు 5,95,500, రూపాయల విలువైన 604.7 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఇసుక, కలప,ఎర్రమట్టి గ్రావెల్ అక్రమ రవాణా సంబంధించి జిల్లాలో మొత్తం 221 కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి రవాణాకు ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి నేరస్థులపై ఎన్ డి పి ఎస్ చట్టం కింద మొత్తం 11 కేసులు నమోదు అయ్యాయి. 8,923 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని 17 మంది నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. 604 మంది వ్యక్తులపై మొత్తం 93 జూదం కేసుల నమోదు అయ్యాయి. 13,62,626 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో మొత్తం 2 నాటుసారా కేసులు, 7 ఆహార కల్తీ కేసులు 3 చైనా మాంజా కేసులు నాలుగు నకిలీ విత్తనాలు కేసులు 11 గుట్కా కేసులు 100 ఎక్సైజ్ చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి. సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా మొత్తం 2306 బ్లాక్ అభ్యర్థనలు అందాయి. మొత్తం 1181 మొబైల్ ఫోన్లు లభించగా వాటిలో 722 మొబైల్ సెట్ లను రికవరీ చేసి వాటి అసలైన అప్పగించడం జరిగింది. రికవరీ చేసిన మొత్తం శాతం 61.34%. 2025వ సంవత్సరంలో జిల్లాలో 8 కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడ్డాయి. ఈ తనిఖీలలో 378 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పత్రాలను వెరిఫై చేసిన తర్వాత జరిమానాలు విధించి వాహనాలన్నిటిని వాటి యజమాలకు అప్పగించడం జరిగింది. ప్రస్తుత సంవత్సరంలో జిల్లాలో గంజాయి మట్కా ఆత్మహత్య దోరనుల ను రోడ్డు ప్రమాదాల బాలవివాహాలు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడానికి యువత విద్యార్థులు సీనియర్ సిటిజెన్లు స్వచ్ఛంద సంస్థలు మొత్తం 34,595 మందిని భాగస్వామ్యం చేస్తూ జిల్లాలోని వివిధ సమస్యలపై 141 కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. పాఠశాలలో కళాశాలలో షీ టీమ్స్ ద్వారా సంబంధిత భాగస్వాములు చురుకైన భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమం నిర్వహించబడ్డాయి. విద్యార్థుల అవసరాలను తీర్చడానికి డయల్ 100 షీ టీమ్స్ ఫోక్సో చట్టాలను బాల్యానికి రక్ష 1098 విద్యా ప్రాముఖ్యత సోషల్ మీడియాలో వినియోగం గురించి అవగాహన కల్పించారు. 2025వ సంవత్సరంలో మొత్తం 28830 డయల్ 100 కాల్స్ అందాయి. బ్లూ కోల్ట్స్ ద్వారా ఈ కాల్స్ ను అటెండ్ చేయడం జరిగింది. వీటిలో 129 కాల్స్ ఎఫైర్ నమోదు తో ముగియగా 27746 కాల్స్ రాజు అయ్యాయి. 955 కాల్స్ ఇతర కారణాల ద్వారా పరిష్కరించబడ్డాయి.ప్రస్తుత సంవత్సరంలో మొత్తం 30 శిక్షణ బ్యాచ్లు లు పూర్తి చేయబడ్డాయి. వీటిలో వీటిలో 544 మంది అధికారులు సిబ్బందికి కొత్త క్రిమినల్ చట్టాల NCL అమలుపై శిక్షణ ఇచ్చారు. ఇందులో కోర్టు డ్యూటీ ఆఫీసర్లు సిడిఓస్ కోసం వర్క్ షాప్ లు సైబర్ క్రైమ్ కేసుల వివరణ ఎన్నికల ప్రవర్తన నియమావళి MCC సంబంధిత మార్గదర్శకాల అమలు, కొత్త క్రిమినల్ చట్టాలకు అనుగుణంగా ఆధునిక నేర పరిశోధనలో ఫోరెన్సిక్ పాత్ర వంటి అంశాలపై శిక్షణ అందించారు. పోలీస్ శాఖలో నిఘ జవాబుదారితనం ప్రజల భద్రతను మెరుగుపరచడం ద్వారా నేరాల నివారణలో సీసీటీవీ కెమెరాలో కీలక పాత్ర పోషిస్తాయి. సిసి టీవీ ఫుటేజ్ బహిరంగ ప్రదేశాలను ఎప్పటికప్పుడు పరవేశించడానికి అనుమానస్పద కార్యక్రమాలపై త్వరగా స్పందించడానికి విచారణ కోసం కచ్చితంగా ఆధారాలు సేకరించడానికి సహాయపడుతుంది. మొత్తం సీసీ కెమెరాలు శాంతిభద్రతల సామర్థ్యాన్ని మెరుగుపరచడం సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా నేర నివారణ ప్రయత్నాలను బలోపేతం చేస్తాయి. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు జిల్లాలో 1741 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రస్తుత 2020 సంవత్సరంలో మొత్తం 45 ముఖ్యమైన బంధ బస్సు వీధులు నిర్వహించబడ్డాయి వీటి కోసం 3 358 మంది అధికారులు సిబ్బందిని మోహరించారు. పక్క ప్రణాళికలతో పోలీసు అధికారులు సిబ్బంది సహకారంతో ఇతర శాఖల అధికారులతో సహకారంతో జిల్లాలు ఎలాంటి ఆలోచనయమైన సంఘటన జరగకుండా ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణం చేయడం జరిగింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News