నేటి సాక్షి వికారాబాద్ :వికారాబాద్ జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు (TBOCWWB) తరఫున 10 రోజుల పాటు నిర్వహించనున్న అవగాహన సదస్సులు – BOCW సామాజిక భద్రత పథకాలు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, గోడపత్రాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో.అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి వికారాబాద్ జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ శ్రీ. బి. వాల్య అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ యాదయ్య అంకిత స్వచ్ఛంద సంస్థ శ్రీ. ప్రకాష్ కుమార్ పాల్గొన్నారు.కలెక్టర్ మాట్లాడుతూనిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలు పొందడానికి BOCW రిజిస్ట్రేషన్ & రీన్యువల్ తప్పనిసరి అని, భవన ఇతర నిర్మాణ కార్మికులు అందరూ నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ప్రధాన సంక్షేమ పథకాలు :1. ప్రమాద మరణ సహాయం రూ ₹10,00,000/-2. సహజ మరణ సహాయం – రూ₹2,00,000/-3.వైకల్య సహాయం-రూ₹5 లక్షల వరకు.4. పెళ్లి కానుక – రూ ₹30,000/-5. ప్రసూతి సహాయం – రూ₹30,000/-6. హాస్పిటలైజేషన్ రిలీఫ్ – నెలకు Rs.4500/- గరిష్టంగా ౩ నెలలు వరకు.7. నమోదు లేని కార్మికుల మరణాలకు ప్రత్యేక సహాయం – ₹.50,000/-8. ఆయుష్మాన్ భారత్ – ₹5 లక్షలు వార్షికం.ఈ 10 రోజుల అవగాహన కార్యక్రమం లో (24-11-2025 నుండి 03-12-2025 వరకు) భవన ఇతర నిర్మాణ కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయగలరు అని కోరుచున్నారు.సంగ్రహంబీ ఓ సి ్వ కార్మికుల సంక్షేమం కోసం రూపొందించిన ఈ 10 రోజుల అవగాహన సదస్సులు, ప్రతి నిర్మాణ కూలీకి ప్రభుత్వ పథకాలు చేరేలా చేయడమే లక్ష్యం.జిల్లా కార్మిక శాఖ, యూనియన్లు, కాంట్రాక్టర్లు, స్థానిక సంస్థలు సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు.





