నేటి సాక్షి వికారాబాద్ క్రమశిక్షణ, దానగు సహనానికి ప్రతీకగా నిలిచే పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను పురస్కరించుకుని వికారాబాద్ జిల్లాలోని ముస్లిం సోదరులందరికీ, వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నెల రోజుల పాటు అత్యంత నిష్ఠతో ఉపవాస దీక్షలు విరమించి జరుపుకునే ఈ వేడుక, జిల్లా ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు సమృద్ధిని నింపాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ పండుగ సమాజంలో మత సామరస్యాన్ని, సోదరభావాన్ని మరింత పటిష్టం చేయాలని ఆమె కోరారు.ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణం లో జిల్లా లో పండుగలు చేసుకోవాలని ఎస్పీ తెలియజేయడం జరిగింది.





