నేటి సాక్షి, దేవరకద్ర జులై 8
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం కేంద్రంలోని హైవే రోడ్డు పక్కన
ఇటివల ప్రారంభించిన విఘ్నేష్ విరాట్ టిఫిన్ సెంటర్ హోటల్ ను జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ మంగళవారం సందర్శించారు.ఆ హోటల్ బృందం కోరిక మేరకు మాజీ ఎమ్మెల్యే ఆ హోటల్ కు వెళ్లి విఘ్నేష్ టిఫిన్ సెంటర్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడున్న పరిశుభ్రతను చూసి వారిని ప్రశంసించారు.విఘ్నేష్ హోటల్ నిర్వాహకులు నాణ్యమైన ఆహారం అందించాలన్న మాజీ ఎమ్మెల్యే ఆకాంక్షించారు. పరిశుభ్రత, ఆహార నాణ్యత,విఘ్నేష్ సేవా దృక్పథం ప్రశంసనీయమని మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ వారిని కొనియాడారు.